TTD Recruitment 2024: భారీ జీతంతో ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ మరియు టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ ల్యాబోరేటరీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల వివరాలు మరియు అప్లై విధానం క్రింద ఇచ్చినది.
TTD Recruitment 2024 ముఖ్యాంశాలు:
విభాగం | వివరాలు |
---|---|
కంపెనీ పేరు | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) |
జాబ్ రోల్స్ | పీడియాట్రిక్ కార్డియాక్ అనస్తటిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, HOD/QUALITY MANAGER |
విద్యా అర్హత | వైద్య పీజీ (పీడియాట్రిక్ పోస్టులకు), కెమిస్ట్రీ/బయో కెమిస్ట్రీ/పుడ్ టెక్నాలజీ (ల్యాబ్ పోస్టులకు) |
వయసు పరిమితి | పీడియాట్రిక్ పోస్టులకు 42 ఏళ్లు, ల్యాబ్ పోస్టులకు 62 ఏళ్ల లోపు |
జీతం | ₹1,01,500 – ₹1,67,400 |
జాబ్ లొకేషన్ | తిరుపతి, తిరుమల |
అనుభవం | అవసరం ఉంది |
TTD Recruitment 2024 పూర్తి వివరాలు:
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్:
- జాబ్ రోల్స్: పీడియాట్రిక్ కార్డియాక్ అనస్తటిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్
- అర్హతలు: వైద్య విద్య మరియు పీజీ పూర్తి చేసి ఉండాలి.
- జీతం: ఎంపికైన వారికి నెలకు ₹1,01,500 నుండి ₹1,67,400 వరకు జీతం చెల్లిస్తారు.
- వయోపరిమితి: 42 ఏళ్ల లోపు.
- దరఖాస్తు విధానం: పూర్తి చేసిన దరఖాస్తులను ‘ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, BIRRD దగ్గర, తిరుపతి – 517507’ చిరునామాకు పంపించాలి.
టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ ల్యాబోరేటరీ:
- జాబ్ రోల్: HOD/QUALITY MANAGER
- అర్హతలు: కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, డైరీ కెమిస్ట్రీ, ఫుడ్ సెఫ్టీ లేదా ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ లేదా పీహెచ్డీ పూర్తి చేసి కనీసం 10 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి.
- వయోపరిమితి: 62 ఏళ్ల లోపు.
- దరఖాస్తు విధానం: పూర్తి చేసిన దరఖాస్తులను ‘మార్కెటింగ్ గోడాన్ ఫస్ట్ ఫ్లోర్, గోశాల పక్కన, తిరుమల – 517504’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు గడువు: నవంబర్ 30, 2024
మరిన్ని వివరాలు మరియు అప్లై లింక్: Official Website – Tirumala.org
ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పద్ధతిలో టీచింగ్ ఉద్యోగాలు- Click Here
AP TET Result 2024 Checking Process & Link | AP TET ఫలితాలు ఎలా చెక్ చేయాలి? ఏపి టీఈటీ- Click Here
Tags: TTD Jobs, Tirumala Tirupati Jobs, TTD Recruitment 2024, Jobs in Telugu, TTD Contract Jobs

నాగదాసరి నరసింహులు గారు ఒక అనుభవజ్ఞులైన డిజిటల్ జర్నలిస్ట్. ఆయనకు తెలుగు వార్తా రచన, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం, మరియు సామాజిక అంశాలపై విశ్లేషణ లో ప్రత్యేకమైన పట్టు ఉంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవంతో, నరసింహులు గారు పాఠకులకు నమ్మదగిన, స్పష్టమైన సమాచారం అందించడం లక్ష్యంగా పని చేస్తున్నారు.
ప్రతి ఆర్టికల్‌కి పూర్తి పరిశోధన చేసి, నిజమైన వాస్తవాలతో ప్రజలకు ఉపయోగపడే కంటెంట్‌ను అందించడం ఆయన ప్రత్యేకత.
ప్రస్తుతం ఆయన ముఖ్య రచయితగా పని చేస్తున్నారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి.